త‌మిళ రీమేక్‌లో సందీప్ కిష‌న్‌

Published On: March 13, 2018   |   Posted By:

త‌మిళ రీమేక్‌లో సందీప్ కిష‌న్‌

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ ఇప్పుడు ఓ త‌మిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నారు. తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న `న‌ర‌గాసుర‌న్‌` (న‌ర‌కాసురుడు) సినిమాతో సందీప్ బిజీ బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు `ఇండ్రు నెట్టు నాలై` సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ట‌. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే కొత్త ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడు. ఇది సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్‌లో రూపొందిన చిత్రం. సందీప్ లెటెస్ట్ చిత్రం `మ‌న‌సుకు న‌చ్చింది` ఆశించ‌న స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సందీప్ న‌ర‌గాసుర‌న్ సినిమాపై చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు.