త‌రుణ్ చిత్రంలో మంచు మ‌నోజ్ అతిథి

Published On: February 13, 2018   |   Posted By:

త‌రుణ్ చిత్రంలో మంచు మ‌నోజ్ అతిథి

ఈత‌రం క‌థానాయ‌కులు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నార‌న‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌. చాలా గ్యాప్ త‌ర్వాత హీరో త‌రుణ్ `ఇది నా ల‌వ్‌స్టోరీ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో మంచు మ‌నోజ్ ఓ అతిథి పాత్ర‌లో క‌న‌ప‌డతున్నాడు. ఈ విష‌యాన్ని మంచు మ‌నోజ్ తెలియ‌జేశాడు. త‌రుణ్‌పై అభిమానంతోనే ఈ చిత్రంలో అతిథి పాత్ర చేశాన‌ని మ‌నోజ్ తెలిపారు. ఈ సినిమాతో త‌రుణ్ మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓవియా హీరోయిన్‌గా న‌టించింది. ర‌మేష్ గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.