దర్శకురాలు మంజుల ఇంటర్వ్యూ

Published On: February 12, 2018   |   Posted By:
దర్శకురాలు మంజుల ఇంటర్వ్యూ
Image result for manjula ghattamaneni
ఒకప్పుడు కృష్ణ కూతురు, మహేష్ అక్క మాత్రమే. కానీ ఇప్పుడు దర్శకురాలు అనిపించుకుంది. అవును.. మెగాఫోన్ పట్టిన మంజుల తన తొలి ప్రయత్నంగా మనసుకు నచ్చింది అనే సినిమాను తెరకెక్కించింది. తన మనసుకు బాగా నచ్చడంతోనే ఈ సినిమాతో దర్శకురాలిగా మారానంటున్న మంజుల.. మూవీ విశేషాలతో పాటు మహేష్, కృష్ణ గురించి ఏంటుందో చూద్దాం
ఇది నా మనసుకు నచ్చింది
నేను ఏదో ఒకటి చేయాలని సినిమా చేయలేదు. అసలు నాకు ఆ అవసరం లేదు. కానీ ఈ ప్రకృతిలో ఏదైతే చూశానో, ఏదైతే ఫీల్ అయ్యానో అది అందరితో పంచుకోవాలనిపించింది. అది సినిమాతోనే సాధ్యం. అదే నా సినిమాకు మనసుకు నచ్చింది అనే పేరుపెట్టాను.
ఇందులో ప్రకృతి కనిపిస్తుంది
‘మనసుకు నచ్చింది’ ఒక లవ్ స్టోరీ. కానీ ఈ సినిమాలో ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుంది. కథలో చాలా లేయర్స్ ఉంటాయి.  సినిమాని మన హృదయానికి హత్తుకునేలా చేయడానికి ప్రకృతిని వాడుకున్నాను. గాలి, నీరు, సూర్యాస్తమం, పువ్వులు… ఇలా నేచర్ లో ప్రతి అద్భుతాన్ని స్క్రీన్ పై ఎలివేట్ చేశాను.
కావాలని చేయలేదు
ఏదో చేయాలి కాబట్టి సినిమా  చేయలేదు. స్టోరీ రెడీ అవ్వడానికి నాకు 18 నెలలు పట్టింది. సినిమాలో కథకే కాదు… క్యారెక్టర్స్ కి కూడా లైఫ్ ఉంటుంది. వాటికంటూ స్టోరీలో ఓ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే క్యారెక్టర్స్ ని రిఫరెన్స్ తీసుకున్నాను.,  సినిమాలో ‘నిత్య’ క్యారెక్టర్, నా క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడూ సన్ రైజ్ ని సన్ సెట్ ని మిస్సవ్వను. ఈ సినిమాలో హీరోయిన్ కూడా అంతే. ఇంకా నా చుట్టూరా ఉండే మనుషులు, నాన్నగారి క్యారెక్టర్ నుండి మహేష్ క్యారెక్టర్ నుండి రిఫరెన్స్ తీసుకున్నాను. స్టోరీ మాత్రం చాలా ఫ్రెష్ గా  ఉంటుంది.
హీరోను దృష్టిలో పెట్టుకోను
నేను ఒక హీరోని మైండ్ లో పెట్టుకుని కథను రాసుకోవడాన్ని నమ్మను. స్టోరీ మొత్తం రాసిన తర్వాతే నటీనటుల ఎంపిక చేపట్టాం. నాన్నగారి సినిమాలు, మహేష్ సినిమాలు తప్ప పెద్దగా చూడను. దాంతో నాకు యంగ్ హీరోస్ పెద్దగా తెలీదు. అందుకే ఈ సినిమా కోసం సందీప్ కన్నా ముందే చాలా మందిని అనుకున్నాం. కానీ లక్కీగా వర్కవుట్ కాలేదు. సందీప్ ఈ సినిమాకి కరెక్ట్.
సందీప్ సూపర్
సందీప్ కి మంచి కంటెంట్ ఇస్తే తను సూపర్బ్ గా పెర్ఫామ్ చేస్తాడు. అది మీకు ఈ సినిమాలో కనిపిస్తుంది. తన క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొంచెం మొండిగా, ఇన్ సెక్యూర్డ్ గా, కోపంగా, లవబుల్ గా, క్రియేటివ్ గా  చివరికి తనకేం కావాలో తెలుసుకుని తనను తాను మార్చుకునే పాత్ర.
దర్శకత్వమే ఇష్టం
యాక్టింగ్ కన్నా డైరెక్షనే నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ గా నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా షూటింగ్ టైమ్ లో  10 సినిమాలు చేసినంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నాన్నగారిని చూసి యాక్టింగ్ వైపు ఎట్రాక్ట్ అయ్యాను కానీ డైరెక్షనే నా ఫస్ట్ లవ్. భవిష్యత్తులో కూడా దర్శకత్వం వైపే ఉంటాను.
ఎమోషన్స్ ముఖ్యం
స్టోరీ రైటింగ్ అంటే లాంగ్వేజ్ పై చాలా కమాండ్ ఉండాలేమో అనుకునే దాన్ని. కానీ ఎప్పుడైతే నేను స్టోరీ రాయడం మొదలుపెట్టానో అప్పుడర్థమయింది. స్టోరీ టెల్లింగ్ అంటే భావోద్వేగాలు మాత్రమే. లాంగ్వేజ్ కాదు. భాషపై పట్టు ఉంటే మంచిదే కానీ, భావోద్వేగాలు లేకపోతే కష్టం. అవి నాకున్నాయి అనిపించింది.
బయట నిర్మాత దొరికాడు
నేను సినిమా డైరెక్షన్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నాన్నగారు చాలా థ్రిల్ ఫీలయ్యారు. నేను ‘తెలుగు వీర లేవరా’ సినిమాకి పని చేశాను కానీ, నేనింత సీరియస్ గా ఉన్నానన్న విషయం ఆయనకు తెలీదు.. అందునా కిరణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పగానే చాలా హ్యాప్పీ… బయటి ప్రొడ్యూసర్ ని ఒప్పించినందుకు థ్రిల్ గా ఫీలయ్యారు…
మహేష్  తో సినిమా చేస్తా
డైరెక్షన్ అంటే ఎంతో టఫ్ జాబ్.. అసలేమనుకుంటున్నావ్ అన్నాడు మహేష్. కానీ ఎప్పుడైతే మూవీ ట్రైలర్ చూశాడో షాక్ అయ్యాడు. బాగా తీశావంటూ మెచ్చుకున్నాడు. మహేష్ బాబు తో సినిమా చేసినా, తనని మైండ్ లో పెట్టుకుని స్టోరీ రాయను. మహేష్ బాబుకు సూట్ అవ్వని  స్టోరీ ఉండదు కానీ, తన ఇమేజ్ కి తగ్గట్టు ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమా చూసిన తరవాత నేను రాయకముందే తనే నా దగ్గరికి వచ్చి సినిమా చేస్తానంటాడు. మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. మహేష్ బాబు లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్టార్ మన టాలీవుడ్ కి దొరకడం అదృష్టం.
నో గెస్ట్ రోల్
నేను ఈ సినిమాలో గెస్ట్ రోల్ లాంటివేమీ చేయలేదు. మా అమ్మాయితో పాటు నా భర్త ఈ సినిమాలో నటించారు, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
ఏదైనా సాధించవచ్చు
నేను ఇంతకు ముందు సోషల్ మీడియాలో కూడా లేను. ఈ సినిమా కోసం రీసెంట్ గా ఫేస్ బుక్ కి వచ్చాను. నాకు సెల్ఫీ తీసుకోవడం కూడా రాదు. రీసెంట్ గా నాకు మా పాప నేర్పింది. కానీ సోషల్ మీడియా వండర్ ఫుల్ ప్లాట్ ఫామ్. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఏదైనా సాధించవచ్చు.
రెహ్మాన్ తో వర్కవుట్ కాదు
నాకు A.R. రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు కూడా నేను అయన చేస్తే బావుంటుందని అనుకున్నా.. కానీ ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఒకవేళ ఆయన చేసినా ఆయన టైమ్ ఫ్రేమ్స్, నా టైమ్ ఫ్రేమ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు అందుకే రథన్ అనుకున్నాను. తను ‘అందాల రాక్షసి’ సినిమాకి చేసిన సాంగ్స్ వింటే A.R. రెహమాన్ గుర్తొచ్చారు… అందుకే రథన్ ని ఫిక్సయ్యా.. మైండ్ బ్లోయింగ్ ట్యూన్స్ ఇచ్చాడు