దసరా నుంచి రంగస్థలం హంగామా

Published On: September 23, 2017   |   Posted By:
దసరా నుంచి రంగస్థలం హంగామా
సుకుమార్ దర్శకత్వంలో చాలా రోజులుగా ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీకి రంగస్థలం-1985 అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ డిజైన్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు దసరా నుంచి ససలైన హంగామాకు తెరతీయనుంది యూనిట్. ఆ రోజు సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.
రంగస్థలం సినిమాలో చెర్రీ గెటప్ ఎలా ఉండబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. గుబురు గడ్డం, భారీ మీసం, 80ల నాటి డ్రెస్సింగ్ స్టయిల్, లుంగీ, చెప్పులు.. ఇలా కంప్లీట్ డిఫరెంట్ లో కనిపిస్తున్నాడు చరణ్. ఆ స్టిల్స్ ఇప్పటికే చాలామంది చూశారు. కాకపోతే ఈసారి అఫీషియల్ గా ఓ లుక్ ను విడుదల చేయాలని, సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగేలా ఆ స్టిల్ రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదల చేయాలనేది రామ్ చరణ్ ప్లాన్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అందుబాటులోనే ఉన్నాడు. దసరాకు హైదరాబాద్ లోనే ఉంటాడు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్ చేతుల మీదుగానే రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదలవుతుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.