దాదాపు పూర్త‌యిన సుధీర్‌బాబు చిత్రం

Published On: May 26, 2018   |   Posted By:
దాదాపు పూర్త‌యిన సుధీర్‌బాబు చిత్రం
హీరోగా, విల‌న్‌గా, స‌పోర్టింగ్ ఆర్టిస్ట్‌గా వివిధ పాత్ర‌లు చేసే సుధీర్‌బాబు త్వ‌ర‌లోనే నిర్మాత‌గా కూడా మారుతున్న సంగ‌తి తెలిసిందే. సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసేలా సుధీర్ నిర్ణ‌యించుకున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే ఓ సినిమాను సైలైంట్‌గా స్టార్ట్ చేసేశాడ‌ట‌. సినిమా 80 శాతం పైగానే పూర్త‌య్యింద‌ట‌. రామానాయుడు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందిన రాజ‌శేఖ‌ర్ నాయుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్ర‌స్తుతం సుధీర్ బాబు స‌మ్మోహ‌నంతో పాటు వీర‌భోగ వ‌సంత‌రాయలు సినిమాలో న‌టిస్తున్నాడు.