దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం

Published On: November 13, 2018   |   Posted By:

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం

ఇంత‌కు ముందు `జంక్ష‌న్ లో జ‌య‌మాలిని` చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌ల్లో ఒక‌రైన ఎమ్ఈ బాబు నిర్మాత‌గా దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మ‌రో చిత్రం ప్రారంభ‌మైంది. ఈ చిత్రం ఇటీవ‌ల బోర‌బండలోని ఓ టెంపుల్ లో మొద‌లైంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నర్రా శివ‌నాగేశ్వ‌ర‌రావు (శివ‌నాగు) ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా…మ‌రో అతిథి ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కులు శివ సుబ్ర‌హ్మ‌ణ్యం మాస్ట‌ర్ క్లాప్ కొట్టారు. వినాయ‌క యాడ్స్ అధినేత బి.వినాయ‌క‌రావు కెమెరా స్విచాన్ చేశారు.

ఎన్నోచిత్రాల‌కు ప‌ని చేసిన సీనియ‌ర్ ఎడిట‌ర్ నూత‌ల‌పాటి ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యూట్యూబ్ కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్ఈ బాబు ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. యూత్‌కి న‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కిస్తున్నాం. ఓ ప్ర‌ముఖ హీరో న‌టించ‌నున్నారు. హీరోయిన్ ని కూడా త్వ‌ర‌లో ఫైన‌ల్ చేస్తాం. ఈ నెలాఖ‌రులో షూటింగ్ ప్రారంభిస్తాం. కొత్త పాత న‌టీన‌టుల క‌ల‌యిక‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నామ‌ని నిర్మాత ఎమ్ఈ బాబు చెప్పారు.