ద‌క్షిణాది చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌

Published On: September 25, 2017   |   Posted By:

ద‌క్షిణాది చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌

లోఫ‌ర్ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న న‌టించిన బాలీవుడ్ హీరోయిన్ దిశాప‌టాని అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మ‌డు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించ‌నుంది. ఆ సినిమా మ‌రేదో కాదు, సంఘ‌మిత్ర‌.  సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ మూవీగా సినిమా చేయాల‌ని నిర్మాణ సంస్థ తెన్నాండాల్ సంస్థ నిర్ణ‌యించింది.

 

టైటిల్ రోల్‌లో శ్రుతిహాస‌న్‌, కీల‌క‌పాత్ర‌ల్లో జ‌యం ర‌వి, ఆర్య‌లు న‌టించ‌డానికి ఓకే అన్నారు. క‌త్తి యుద్ధాలు, గుర్ర‌పు స్వారీ అన్నీ నేర్చుకున్నారు. అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ శ్రుతి ఆ చిత్రం నుంచి త‌ప్పుకుంది. త‌ర్వాత టైటిల్ రోల్ ఎవ‌రు చేస్తార‌నే దానిపై ప‌లు పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. ఇందులో హ‌న్సిక‌, అనుష్క‌, న‌య‌న‌తార వంటి పేర్లు వినిపించాయి. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

 

ఇప్పుడు శ్రుతి స్థానంలో ‘లోఫ‌ర్’ హీరోయిన్ దిశా ప‌టాని చేరింద‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక వార్త అయితే ఇంకా రాలేదు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నున్న ఈ చిత్రంలో ‘జ‌యం’ ర‌వి, ఆర్య హీరోలుగా న‌టించ‌నున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.