దర్శకేంద్రుడి పెళ్లిసందడి కి 25 ఏళ్లు

“పెళ్లిసందడి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను.ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమాని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీలతో చేస్తున్నాము.నా దర్శకత్వ పర్యవేక్షణలో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం.త్వరలో థియేటర్లో కలుద్దాం.. మీ రాఘవేంద్రరావు.