ద‌స‌రాకి మిస్.. సంక్రాంతికి ఎస్‌

Published On: August 11, 2017   |   Posted By:

ద‌స‌రాకి మిస్.. సంక్రాంతికి ఎస్‌

భారీ చిత్రాల‌తో ద‌స‌రా స‌ర‌దాలు ఓ రేంజ్ లో ఉంటాయ‌నుకున్న స‌మ‌యంలో… బ‌రిలో నుంచి త‌ప్పుకుంది బాల‌కృష్ణ కొత్త చిత్రం పైసా వ‌సూల్. చివ‌రాఖ‌రికి ఈ విజ‌య‌ద‌శ‌మికి మ‌హేష్ బాబు స్పైడ‌ర్‌, ఎన్టీఆర్ జైల‌వ‌కుశ మాత్రమే సంద‌డి చేయ‌బోతున్నాయి. అయితే.. ద‌సరాకి పోటీప‌డుతార‌నుకున్న బాల‌య్య, మ‌హేష్‌లు సంక్రాంతికి పోటీప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

స్పైడ‌ర్ త‌రువాత మ‌హేష్ చేస్తున్న భ‌ర‌త్ అనే నేను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుండ‌గా.. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య‌ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. గ‌తంలోనూ సంక్రాంతి సీజ‌న్‌లో బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబు పోటీప‌డ్డారు. 2002లో బాల‌య్య న‌టించిన సీమ‌సింహం, మ‌హేష్ న‌టించిన ట‌క్క‌రి దొంగ చిత్రాలు అలా పోటీప‌డ్డాయి. మ‌ళ్లీ అదే సీజ‌న్‌కి ఈ ఇద్ద‌రి సినిమాలు మ‌రోసారి పోటీప‌డ‌నుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.