ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ్‌

Published On: February 7, 2018   |   Posted By:

ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ్‌

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ముగియగానే నాగ్ ఓ ద్విభాషా చిత్రంలో న‌టించ‌బోతున్నాడ‌న్నాడ‌ట‌. ఈ సినిమాలో హీరో ధ‌నుష్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ చిత్రంతో ధ‌నుష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. రీసెంట్‌గా ధ‌నుష్, నాగార్జునను క‌లిసి స్క్రిప్ట్ వినిపించాడ‌ట‌. నాగ్‌కు అంతా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడ‌ట‌. త‌మిళంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన తెన్నాండాల్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. మ‌రో విష‌యమేమంటే ఈ సినిమాను ధ‌నుష్ డైరెక్ట్ చేయ‌డం. ఇప్ప‌టికే త‌మిళంలో ఓ సినిమాను డైరెక్ట్ చేసిన ధ‌నుష్‌కి ఇదే తొలి ద్విభాషా చిత్ర‌మ‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు.