నక్షత్రం సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Published On: July 22, 2017   |   Posted By:
నక్షత్రం సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ దక్కింది సినిమాకు. సెన్సార్ పూర్తవ్వడంతో సినిమా తేదీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఆగస్ట్ 4న నక్షత్రంను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
నిజానికి ఈ నెలాఖరుకు, అంటే జులై 28న నక్షత్రం వస్తుందని అనుకున్నారు. కానీ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో డౌట్స్ కు తెరపడింది. కృష్ణవంశీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఓ సాధారణ కుర్రాడు.. పోలీస్ గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నక్షత్రంలో మెయిన్ ఎట్రాక్షన్ సాయిధరమ్ తేజ్. అవును.. ఈ సినిమాలో అలెగ్జాండర్ అనే కీలక పాత్ర పోషించాడు తేజూ. సినిమాకు ఇదే మెయిన్ ఎట్రాక్షన్ అంటున్నారు. దీంతోపాటు శ్రియ ఐటెంసాంగ్.. హీరోయిన్లు రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ అందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. మరో హీరో తనీష్.. ఈ సినిమాతో విలన్ గా పరిచయం కాబోతున్నాడు.