నయనతార పొలిటికల్ డ్రామా చిత్రం కర్తవ్యం

Published On: October 12, 2017   |   Posted By:

నయనతార పొలిటికల్ డ్రామా చిత్రం కర్తవ్యం

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్  నిర్మాతగా  ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts )  పతాకం పై తమిళం లో నిర్మించబడుతున్న ఆరమ్ (Araam)  చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార ఒక డిస్ట్రిక్ట్  కలెక్టర్ గా మనకు కనువిందు చేస్తున్నారు.

వరుస విజయాలతో, డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ తో దూసుకువెళుతున్న నయనతార ఈ చిత్రం లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ప్రేక్షుకులని అలరించాడని స్థిధం అవుతున్నారు . ఎన్నో  విజయవంత చిత్రాలను డిస్ట్రిబ్యూట్  చేసిన ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రం తెలుగు హక్కులు సొంతం చేసుకొనడం తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చక్రం, డేంజర్ మరియు కృష్ణార్జున చిత్రాలకి పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమరామెన్ గా వేయహరిస్తున్నారు.

ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యాక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలో విడుదల అవుతుంది.

బ్యానర్ : ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts )
చిత్రం : కర్తవ్యం

నటీనటులు  :

నయనతార
విగ్నేష్
రమేష్
సును లక్ష్మి
వినోదిని వైద్యనాథన్
రామచంద్రన్ దురైరాజ్
ఆనంద్ కృష్ణన్

కెమెరా : ఓం ప్రకాష్
మ్యూజిక్ : జీబ్రాన్
ఎడిటింగ్ : గోపి కృష్ణ
కథ దర్శకత్యం : గోపి నైనర్
నిర్మాత : ఆర్ రవీంద్రన్

Source:-Press – Note