నయనతార బర్త్ డే స్పెషల్

Published On: November 18, 2017   |   Posted By:
నయనతార బర్త్ డే స్పెషల్
సౌతిండియా స్టార్ హీరోయిన్, కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ పుట్టినరోజుతో ఆమె 32 ఏళ్లు కంప్లీట్ చేసుకొని, 33వ ఏట అడుగుపెట్టింది. అంతేకాదు.. ఈ పుట్టినరోజుకు ఆమెకు ఊహించని బహుమతి కూడా అందింది. సరిగ్గా వారం కిందట విడుదలైన అరమ్ సినిమా కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం 3 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. అందుకే ఈ బర్త్ డే నయన్ కు వెరీవెరీ స్పెషల్.
తమిళ్ లో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించిన నయనతార చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. వీటిలో బాలయ్యతో చేస్తున్న జై సింహా కూడా ఉంది. వచ్చే ఏడాది తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటోంది ఈ భామ. తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతున్న నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.