నవంబర్ 9 న  అదిరింది గ్రాండ్ రిలీజ్

Published On: November 3, 2017   |   Posted By:
నవంబర్ 9 న  అదిరింది గ్రాండ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ట్రైలర్లకు కు అద్భుతమైన స్పందన లభించింది. తమిళం లో ఇటీవలే విడుదలై ఇప్పటికే దాదాపు 200 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తోంది. పలు రికార్డు ల లెక్కలు మార్చేసిన అదిరింది చిత్రాన్ని తెలుగు లో నవంబర్ 9 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి.  తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించాడు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
నిర్మాత  శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ 100 చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో నవంబర్ 9 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. తమిళ్ లో ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.   రాజా రాణి, తెరి వంటి కమర్షియల్ సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచ‌నాలు భారీగా వున్నాయి. విజ‌య్ ఫెర్‌ఫార్మెన్స్ మ‌రో రేంజి లో చూడ‌బోతున్నారు. స‌మంత‌, కాజ‌ల్, నిత్యామీన‌న్ లు పోటాపోటీగా న‌టించారు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.
ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది.
నటీనటులు – విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్
సాంకేతిక నిపుణులు
సంగీతం – ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం – వివేక్
సినిమాటోగ్రాఫర్ – జి.కె.విష్ణు
ఎడిటర్ – రుబన్
యాక్షన్ – అనల్ అరసు
కొరియోగ్రఫి – శోభి
స్టోరీ – విజయేంద్రప్రసాద్
స్క్రీన్ ప్లే – విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్
నిర్మాతలు – మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – అట్లీ
Source:-Press – Note

Leave a Reply

Your email address will not be published.