నాగచైతన్య సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Published On: September 13, 2017   |   Posted By:

నాగచైతన్య సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

త్వరలోనే  మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశాడు నాగచైతన్య. ఆ సినిమా పేరు మంచోడు. టైటిల్ క్యాచీగా, గమ్మత్తుగా ఉంది కదా. అందుకే ఈ టైటిల్ నే ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్టోరీలైన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ అయింది.

నిజానికి స్టోరీ ఏంటనేది నాగచైతన్యకు కూడా తెలీదు. మారుతితో ఓ సినిమాకు కమిట్ అయ్యానని, కానీ స్టోరీ ఏంటనే విషయం తనకు తెలియదని, మారుతి ఇంకా స్టోరీ నెరేట్ చేయలేదని స్వయంగా చైతూ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మంచోడు అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

తన సినిమాలకు డిఫరెంట్ టైటిల్స్ పెట్టడంలో మారుతి ఎక్స్ పర్ట్. బాబు బంగారం, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు… ఇప్పుడు మంచోడు. ఇలా డిఫరెంట్ గా వెళ్తున్నాడు మారుతి.