నాగార్జున‌తో అమ‌ల‌

Published On: March 13, 2018   |   Posted By:

నాగార్జున‌తో అమ‌ల‌

నాగార్జున‌, అమ‌ల ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు క‌దా! మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి ఏం చేయ‌బోతున్నార‌నే సందేహం రావ‌చ్చు.

నాగార్జున‌, అమ‌ల క‌లిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే అక్కినేని అమ‌ల‌తో నాగ్ చేయ‌డం లేదు. అమ‌లాపాల్‌తో నాగార్జున క‌లిసి న‌టించ‌బోతున్నారు.

అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా నాగ్‌, నాని మ‌ల్టీస్టార‌ర్‌లో నాగ్ స‌ర‌స‌న అమ‌లాపాల్ న‌టించ‌నుంది. ఈ నెల 18 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. `జెండాపై కపిరాజు` త‌ర్వాత అమ‌లాపాల్ మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌లేదు. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే పెళ్లి త‌ర్వాత అమ‌లాపాల్ న‌టించ‌బోయే సినిమా ఇదే అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.