నాగ్‌ లాగే బాల‌య్య మంచి హిట్  ఇస్తాడా?

Published On: August 18, 2017   |   Posted By:
నాగ్‌ లాగే బాల‌య్య మంచి హిట్  ఇస్తాడా?

 15 ఏళ్ల‌కు పైగా క‌థానాయిక‌గా రాణిస్తోంది శ్రియ‌. తొలి రోజుల్లో ఎంత నాజుగ్గా ఉందో.. ఇప్ప‌టికీ అంతే నాజుగ్గా క‌నిపిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోందీ ఢిల్లీ డాళ్‌. ఈ ఏడాది ఆరంభంలో గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిలో  వ‌శిష్టీ దేవి గా త‌న అభిన‌యంతో అల‌రించిన శ్రియ‌.. ప్ర‌స్తుతం పైసా వ‌సూల్ ఫ‌లితం కోసం ఆశ‌గా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. ఇది బాల‌కృష్ణ‌తో శ్రియ చేస్తున్న మూడో సినిమా.
చెన్న‌కేశ‌వ‌రెడ్డితో తొలిసారిగా ఈ ఇద్ద‌రు జోడీ క‌ట్టారు. ఆ సినిమా ఫ‌లితం ఫ‌ర‌వాలేద‌నిపించింది.
ఇక బాల‌య్య వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మంచి హిట్ అయింది. ఈ నేప‌థ్యంలో పైసా వ‌సూల్ హిట్ అయితే ఈ కాంబినేష‌న్ హ్యాట్రిక్ కొట్టిన‌ట్టే. ఇదివ‌ర‌కు నాగార్జున కాంబినేష‌న్‌లో సంతోషం, నేనున్నాను, మ‌నం చిత్రాలతో  శ్రియ హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు పైసావ‌సూల్ హిట్ అయితే శ్రియ కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన హీరోల  జాబితాలో బాల‌య్య కూడా చేరుతాడు.