నాగ‌చైతన్య కొత్త సినిమా ప్రారంభం 

Published On: January 20, 2018   |   Posted By:
నాగ‌చైతన్య కొత్త సినిమా ప్రారంభం 
నాగ‌చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది.
నాగ‌చైతన్య, అను ఇమ్మానుయేల్, మారుతి, సూర్యదేవర నాగవంశీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, కల్యాణి నటరాజన్, శరణ్య, పృథ్వీ, రఘుబాబు, రాహుల్ రామ‌కృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిజార్ షఫి, సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమ‌ర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన, దర్శకత్వం: మారుతి.