నానితో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌

Published On: September 23, 2017   |   Posted By:
నానితో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌
వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు `కృష్ణార్జున యుద్ధం` సినిమా చేస్తున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నాని ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌టం విశేషం. అల్రెడి ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుద‌ల చేసేశారు.
తాజా స‌మ‌చారం ప్ర‌కారం ఈ సినిమాలో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే అధికార‌కంగా విష‌యం వెలువ‌డాల్సి ఉంది. ఈ ఏడాది శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంతో స‌క్సెస్ అందుకున్న అనుప‌మ‌కు రంగ‌స్థ‌లం సినిమాలో న‌టించే అవ‌కాశం త‌ప్పిపోయినా, కృష్ణార్జున యుద్ధం సినిమాలో అవ‌కాశం రావ‌డం మంచి ప‌రిణామ‌మే.
నిన్ను కోరి సినిమా త‌ర్వాత నాని న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.