నాని అ! ఫ‌స్ట్ లుక్

Published On: December 23, 2017   |   Posted By:

నాని అ! ఫ‌స్ట్ లుక్


నిత్యా మీన‌న్‌, కాజ‌ల్‌, రెజీనా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, ఈషా రెబ్బా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్ననాని నిర్మాత రూపొందుతున్న చిత్రం `అ!`. ఈ చిత్రాన్ని  ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక వేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ని ఇటీవ‌ల  విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ర‌వితేజతో పాటు నాని కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. సినిమాలో ఒక్కొక్క‌రి లుక్‌ను నాని విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాని ఓ చేప పిల్ల పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని నాని త‌న లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా తెలియ‌జేశారు.