నాని ప్లానింగ్ బావుంది

Published On: August 7, 2017   |   Posted By:
నాని ప్లానింగ్ బావుంది
 
ఈ యంగ్ త‌రం హీరోల్లో నిర్మాత‌ల‌కు నాని మినిమ‌మ్ గ్యారెంటీ హీరోగా క‌న‌ప‌డుతున్నాడు. నాని డిఫ‌రెంట్స్ స్క్రిప్ట్స్‌ను ఎంచుకుని వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నాడు.
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుండి రీసెంట్‌గా విడుద‌లైన నిన్నుకోరి సినిమా వ‌ర‌కు అన్ని విజ‌యాల‌ను సాధించిన‌వే. వ‌రుస స‌క్సెస్‌ల‌తో పాటు నాని ఏక‌బిగిన ఏడాదికి మూడు సినిమాలు విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
2015లో జెండాపై క‌పిరాజు, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌.. 2016లో కృష్ణ‌గాడి వీర‌ప్రేమగాథ‌, జెంటిల్‌మేన్‌, మ‌జ్నుఅంటూ మూడేసి చిత్రాల‌తో సంద‌డి చేసిన నాని.. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే నేను లోక‌ల్‌, నిన్ను కోరి చిత్రాల‌తో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.
దిల్‌రాజు నిర్మాత ఈ ఏడాది చివ‌ర‌లో ఎం.సి.ఎ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మొత్తానికి  మూడేళ్లుగా ప్ర‌తి సంవ‌త్స‌రం మూడేసి సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఏదేమైనా నాని స‌క్సెస్ ప్లానింగ్ బావుంది క‌దూ..