నాని సినిమాలో  ర‌కుల్‌ ప్రీత్ సింగ్

Published On: January 11, 2018   |   Posted By:
నాని సినిమాలో  ర‌కుల్‌ ప్రీత్ సింగ్
వ‌రుస విజయాల‌ను సాధిస్తున్న నేచ‌ర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `కృష్ణార్జున యుద్ధం` సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. కాగా నాని త‌దుప‌రి సినిమాగా నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. శ్రీరాంఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో నాగార్జున డాన్ పాత్ర‌లో, నాని సైక్రియాటిస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నాని స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌బోతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ త‌మిళంలో సూర్య,కార్తీల‌తో సినిమాలు చేస్తుంది. ఈమె న‌టించిన బాలీవుడ్‌లో `అయ్యారి` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తెలుగు ప్రాజెక్టులేమీ చేయ‌డం లేదు అని అనుకుంటున్న త‌రుణంఓ రకుల్‌కు ఈ  అవకాశం రావ‌డంతో ర‌కుల్ ఎస్ చెబుతుంద‌ని అంటున్నారు.