నాని సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్‌న‌టుడు

Published On: February 5, 2018   |   Posted By:

నాని సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్‌న‌టుడు

వ‌రుస విజ‌యాల హీరో నేచ‌ర‌ల్ స్టార్ నాని… ఇప్ప‌టికే ఎనిమిది వ‌రుస విజ‌యాలు అందుకుని..  ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నాని న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.సినిమా చిత్రీక‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు, మోడ‌ల్ అయిన ర‌వి అవ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం కంటే ముందుగా ర‌వి ఇజం సినిమాలో కూడా న‌టించారు.