నాన్న పాత్ర‌లో కొడుకు

Published On: October 30, 2017   |   Posted By:

నాన్న పాత్ర‌లో కొడుకు

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత క‌థ‌పై ఇప్పుడు మూడు సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. అందులో తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాపై అటెన్ష‌న్ ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఆయ‌న పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. కాగా ఈ సినిమాను సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిల‌తో క‌లిసి బాల‌కృష్ణ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించిన విధానం వ‌ర‌కే తేజ  ఈ సినిమాలో చూపించ‌నున్నారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించాల‌నుకున్న‌న‌ప్పుడు చైత‌న్య ర‌థంపై ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని స్పీచ్‌లిచ్చారు. ఈ చైత‌న్య ర‌థ సార‌థిగా అప్ప‌ట్లో హ‌రికృష్ణ వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ఆ పాత్ర‌లో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌న‌ప‌డ‌నున్నారు. అంటే నాన్న పాత్ర‌లో క‌ల్యాణ్ రామ్ న‌టిస్తాడ‌ని సమాచారం. అలాగే ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌.