నారా రోహిత్ కొత్త సినిమా ‘భీముడు’

Published On: September 4, 2017   |   Posted By:

నారా రోహిత్ కొత్త సినిమా ‘భీముడు’

డిఫెరెంట్ సినిమాలతో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు నారా రోహిత్. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ‘కథలో రాజకుమారి’ , ‘బాలకృష్ణుడు’ సినిమాలతో పాటు మరో సినిమాకి కూడా సంతకం చేసేశాడు. ఎప్పుడూ విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకోవడం నారా రోహిత్ స్పెషాలిటీ. ఈసారి కూడా అలాంటిదే మరో ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.

ఇప్పటివరకు అఫీషియల్ పక్కా అయితే కాలేదు కానీ, గతంలో ‘సావిత్రి’ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘భీముడు’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకుందట సినిమా యూనిట్.

బాలకృష్ణుడు సినిమాలో సిక్స్ ప్యాక్ లో ఎట్రాక్ట్ చేయనున్న నారా రోహిత్, ఈ సినిమాలో కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అలరించబోతున్నాడట. త్వరలోనే ఈ మూవీ డీటెయిల్స్ తెలుస్తాయి.