నాలుగోసారి లారెన్స్ సిద్ధమ‌వుతున్నాడు

Published On: August 14, 2017   |   Posted By:

నాలుగోసారి లారెన్స్ సిద్ధమ‌వుతున్నాడు

డ్యాన్స‌ర్‌గా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన శైళిలో రాణిస్తున్నాడు రాఘ‌వేంద్ర లారెన్స్‌. ముని సీక్వెల్స్‌తో స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా లారెన్స్ వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్నాడు. ముని,  కాంచ‌న‌(ముని2), గంగ (ముని3) సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టాయి. ఇప్పుడు లారెన్స్ ఈ సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ముని4గా రాబోతున్నాడ‌ని ముని3 క్లైమాక్స్‌లో చెప్పిన లారెన్స్ ముని 4 క‌థ కోసం చాలా రోజుల వెయిట్ చేశాడు. మంచి క‌థ సిద్ధ‌మైంద‌ని, ముని సీక్వెల్స్‌ను మించి ఈ నాలుగో భాగం ఉంటుంద‌ట‌. త‌మిళంలో ఈ సినిమా నిర్మాణంలో లారెన్స్ భాగ‌మ‌వుతాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ముని సీక్వెల్స్‌లో రాఘ‌వేంద్ర లారెన్స్ భిన్న పార్వాల్లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేస్తాడు. అలాగే త‌న సినిమాల్లో హార్ట్ ట‌చింగ్ ఎలిమెంట్‌ను ట‌చ్ చేస్తుంటాడు. మ‌రి ఈ ముని నాలుగోభాగంలో లారెన్స్ ఎలా భయ‌పెడుతూ న‌వ్విస్తాడో చూడాల్సిందే.