నా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు – మిర్యాల రవీందర్‌ రెడ్డి

Published On: August 24, 2017   |   Posted By:
నా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు – మిర్యాల రవీందర్‌ రెడ్డి 
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జయజానకి నాయక’. బోయపాటి శ్రీను దర్శకుడు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..”నా లైఫ్‌ ఛేంజింగ్‌ మూవీ ఇది. బోయపాటి శ్రీనుగారికి నా కృతజ్ఞతలు. నన్ను చాలా సపోర్ట్‌ చేసి నాకు ఎంతో కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. మా టీమ్‌ని, కథని నమ్మి మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని చాలా భారీగా నిర్మించారు. కాంపిటీషన్‌ వున్నా కూడా ఎక్కడా తగ్గకుండా అనుకున్న రిలీజ్‌ డేట్‌కి ఈ సినిమా రిలీజ్‌ చేసి మాకు పెద్ద హిట్‌ ఇచ్చారు” అన్నారు.
హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ..”ఈ చిత్రంలో ఒక స్ట్రాంగ్‌ మెస్సేజ్‌ వుంది. ఎమోషన్స్‌, సెంటిమెంట్‌, డ్రామా సీన్స్‌ని బాగా క్యారీ చేశారు. బోయపాటిగారి దర్శకత్వంలో మరిన్ని చిత్రాలు చేయాలనుంది” అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ..”అన్నీ తరగతుల ప్రేక్షకులకు నచ్చేలా ఇంత గొప్ప సినిమాని నిర్మించినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. మంచి మెస్సేజ్‌ వున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. నేను ఏ నమ్మకంతో అయితే ఈ చిత్రాన్ని తీసానో.. నా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా హిట్‌తో మా బేనర్‌ వేల్యూ మరింత పెరిగింది. ఇంత మంచి హిట్‌ చిత్రాన్ని తీసిన మా దర్శకులు బోయపాటి శ్రీనుగారికి నా థాంక్స్‌” అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ..”ఈ సినిమాని ఎంతగానో నమ్మి చేశాను. ఎన్ని జనరేషన్స్‌ మారినా హ్యూమన్‌ రిలేషన్స్‌ మారవు. ఆ పాయింట్‌ ఎన్ని రకాల సినిమాలు అయినా తీయొచ్చు. అవి ఎప్పటికైనా సక్సెస్‌ అవుతాయి. మిర్యాల రవీందర్‌ రెడ్టి ది బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ అని నా అభిప్రాయం. సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తి” అన్నారు.