నా నువ్వే మూవీ ట్రయిలర్ రివ్యూ

Published On: May 16, 2018   |   Posted By:

నా నువ్వే మూవీ ట్రయిలర్ రివ్యూ


కల్యాణ్ రామ్, తమన్న జంటగా నటించిన సినిమా నానువ్వే. జయేంద్ర డైరక్ట్ చేసిన ఈ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. సరికొత్త మేకోవర్ లో కల్యామ్ రామ్ కనిపించిన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

ముందే చెప్పుకున్నట్టు నా నువ్వే ట్రయిలర్ లో కల్యామ్ రామ్ మేకోవర్ హైలెట్ గా నిలిచింది. ఇప్పటివరకు కనిపించని విధంగా లవర్ బాయ్ గెటప్ లో భలే సెట్ అయ్యాడు కల్యాణ్ రామ్. ఆ డ్రెస్సింగ్, లుక్స్ అన్నీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఇక ట్రయిలర్ లో కల్యాణ్ రామ్, తమన్న మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.

టెక్నికల్ గా చూసుకుంటే టాప్ క్లాస్ లో ఉంది ట్రయిలర్. దీనికి కారణం పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. ట్రయిలర్ లో ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా, క్లాసీగా ఉంది. దీనికి శరత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్, విజయ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు.