నా పేరు సూర్య సెకెండ్ సింగిల్ రివ్యూ

Published On: February 14, 2018   |   Posted By:

నా పేరు సూర్య సెకెండ్ సింగిల్ రివ్యూ


బన్నీ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య సినిమాకు సంబంధించి దశలవారీగా సాంగ్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీకి సంబందించి సైనిక అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో ఈరోజు సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఎలా ఉందో చూద్దాం

ఫస్ట్ సింగిల్ లో తనలోని దేశభక్తిని చాటిచెప్పిన బన్నీ.. సెకెండ్ సింగిల్ లో తనలోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్కరించాడు. అందుకే ఈ పాటను వాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. పాట వినడానికి కొత్తగా ఉంది. దీనికి కారణం బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్-శేఖర్. వీళ్లలో విశాల్ ఈ పాటను స్వయంగా ఆలపించడం విశేషం.

విన్న వెంటనే క్యాచీగా ఉంది. సాహిత్యంలో ఇంగ్లిష్ పదాలతో పాటు సంగీతంలో వెస్ట్రన్ బీట్ కనిపించింది. ఫస్ట్ సింగిల్ ను రాసిన  రామజోగయ్య శాస్త్రే ఈ పాటను కూడా రాశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.