నా మార్కెట్ వాల్యూ 40 కోట్లు: నితిన్

Published On: August 8, 2017   |   Posted By:

నా మార్కెట్ వాల్యూ 40 కోట్లు: నితిన్

హీరో నితిన్ ఎట్టకేలకు తన మార్కెట్ వాల్యూపై రియాక్ట్ అయ్యాడు. అ..ఆ సినిమాతో తన మార్కెట్ పెంచుకున్న ఈ హీరో, ఇప్పుడు లై సినిమాతో దాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా లై మూవీ బడ్జెట్ తో పాటు, తన మార్కెట్ వాల్యూ గురించి మాట్లాడాడు.

“నా సినిమా మార్కెట్ వాల్యూ ఇప్పుడు 40 కోట్లు. లై సినిమా కోసం నిర్మాతలు కాస్త ఎక్కువే ఖర్చుపెట్టారు. నేను అభ్యంతరం కూడా చెప్పాను. కానీ కథ ప్రకారం ఉండాల్సిందేనంటూ నిర్మాతలు ఖర్చు పెట్టారు. కాకపోతే నా మార్కెట్ వాల్యూ ప్రకారమే ఖర్చు పెట్టారు. ఎక్కడా వృధా చేయలేదు అ..ఆ తర్వాత మాత్రమే నా మార్కెట్ వాల్యూ పెరిగింది”.

తన మార్కెట్ వాల్యూపై నితిన్ రియాక్షన్ ఇది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమా తర్వాత మాత్రమే తన మార్కెట్ వాల్యూ బాగా పెరిగిందని చెప్పుకొచ్చిన నితిన్.. ఇప్పటికీ త్రివిక్రమ్ ను చాలా విషయాల్లో సలహాలు అడుగుతుంటానని.. త్రివిక్రమ్ తనకు గురువు లాంటి వారని చెప్పుకొచ్చాడు.