నిఖిల్‌తో మేఘా ఆకాష్‌

Published On: February 13, 2018   |   Posted By:
నిఖిల్‌తో మేఘా ఆకాష్‌
`కిరాక్ పార్టీ`తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు యంగ్ హీరో నిఖిల్‌. ఈ సినిమా త‌ర్వాత కూడా నిఖిల్ మ‌రో రీమేక్ చేయ‌నున్నాడు. `కిరాక్ పార్టీ` క‌న్న‌డ రీమేక్ అయితే. చేయ‌బోయే సినిమా త‌మిళ రీమేక్‌. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `క‌ణిద‌న్‌` సినిమా తెలుగులో రీమేక్‌లో నిఖ‌ల్ న‌టిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి హీరోయిన్‌గా ముందు క్యాథ‌రిన్‌ను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో మేఘా ఆకాష్‌ను తీసుకునేలా నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఠాగూర్ మ‌ధు నిర్మాత‌. వ‌చ్చే నెల నుండి సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.