నితిన్ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

Published On: December 13, 2017   |   Posted By:

నితిన్ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ ప్ర‌స్తుతం కృష్ణ చైత‌న్య సినిమాలో న‌టిస్త‌న్నాడు. `లై`చిత్రంలో నితిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన మేఘా ఆకాష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే..ఈ సినిమా నితిన్‌కు 25వ సినిమా. ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాకు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ఒక‌టి ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. `శీతాకాలం గుర్తుందా!` అనేదే టైటిల్‌..వింటుంటే కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంది క‌దా. ఈ సినిమా త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.