నితిన్ స‌ర‌స‌న నందితా శ్వేత‌

Published On: February 7, 2018   |   Posted By:

నితిన్ స‌ర‌స‌న నందితా శ్వేత‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో `శ్రీనివాస క‌ల్యాణం` సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా నుండి పూజా హెగ్డే త‌ప్పుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టించ‌నుంది.  `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` సినిమా త‌ర్వాత నందిత శ్వేత నిజార్ ష‌ఫీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా  చేస్తుంది. ఈ సినిమాతో పాటు నితిన్ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.