నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా

Published On: February 17, 2018   |   Posted By:
నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా
యువ క‌థానాయ‌కుడు నితిన్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో `శ్రీనివాస క‌ల్యాణం` సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా రాశీఖ‌న్నాను ఎంపిక చేసుకున్నార‌ట‌. గ‌తంలో  ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా నుండి పూజా హెగ్డే త‌ప్పుకుంది. రాశీ ఖ‌న్నాతో పాటు మ‌రో హీరోయిన్‌గా  నందితా శ్వేత న‌టించ‌నుంది.  `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` సినిమా త‌ర్వాత నందిత శ్వేత నిజార్ ష‌ఫీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా  చేస్తుంది. ఈ సినిమాతో పాటు నితిన్ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.