నీది నాది ఒకే కథ మూవీ థియేట్రికల్ ట్రయిలర్ రివ్యూ

Published On: March 16, 2018   |   Posted By:
నీది నాది ఒకే కథ మూవీ థియేట్రికల్ ట్రయిలర్ రివ్యూ

శ్రీవిష్ణు, నారా రోహిత్ కలిస్తే ఎలాంటి కథలు పుడతాయో, ఎలాంటి సినిమాలొస్తాయో మనకు తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమా ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ కాంబినేషన్ లో సిద్ధమైన సినిమా  ‘నీదీ నాదీ ఒకే కథ’. కాకపోతే ఇందులో శ్రీవిష్ణు హీరో. నారా రోహిత్ నిర్మాత. వేణు ఉడుగుల దర్శకుడు. ఇన్నాళ్లూ టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రయిలర్ తో మెస్మరైజ్ చేస్తోంది
సెల్ఫ్ ఎస్టీమ్, లైఫంటే క్లారిటీ లేని ఒక కన్ఫ్యూజ్డ్ యువకుడి క్యారెక్టర్ లో శ్రీవిష్ణు నేచురల్ లుక్స్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. 2 నిమిషాల 20 సెకెన్ల ట్రైలర్ లో సినిమా స్టోరీని ఎలివేట్ చేయలేదు కానీ, హార్ట్ టచింగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయనే విషయాన్ని చెప్పారు.  లైఫ్ లో ఏం చేయాలో క్లారిటీ లేని యువకుడు, చివరికి తన నాన్నకు నచ్చినట్టుగా ఉంటే చాలు అనుకుంటాడు. ఈ క్రమంలో తనను తాను తెలుసుకోవడమే ఈ సినిమా.
వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాట్నా టైటస్ (బిచ్చగాడు ఫేం) హీరోయిన్ గా నటించింది. ప్రశాంతి, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈనెల 23న థియేటర్లలోకి వస్తోంది నీది నాది ఒకే కథ.