నువ్వు తోపురా’ మూవీ రివ్యూ

Published On: May 4, 2019   |   Posted By:

ఇది రొటీన్ పోపురా( ‘నువ్వు తోపురా’ మూవీ రివ్యూ)

రేటింగ్  :  1/5

అనగనగా ఓ గల్లీ కుర్రాడు సరూర్ నగర్ సూరి (సుధాకర్). బీటెక్ ఆపేసి బేవర్స్ గా తిరిగే అతను …మరీ ఖాలీగా ఉండటం ఎందుకనుకున్నాడో ఏమో కానీ రమ్య(నిత్య శెట్టి)తో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ లవ్ స్టోరీ హ్యాపీ ఎండింగ్ వచ్చేలోగా చిన్న మాట పట్టింపుతో బ్రేకప్ అయ్యిపోతుంది. ఆమె అమెరికా జంప్. మరి మన కుర్రాడు ఆగుతాడా…తను అమెరికా ప్రయాణం వెళ్లాలనుకుంటాడు. అదృష్టం బాగుండి తెలుగు అశోశియేషన్ వాళ్లకు డప్పులు వాయించేవాడు కావాల్సి రావటంతో మనోడుని లాగేస్తారు. హ్యాపీగా అమెరికాలో లాంచ్ అయిన అతనికి అక్కడ సమస్యలే. ఈ లోగా తన తల్లికు ఒంట్లో బాగోలేదని తెలుస్తుంది. డబ్బు కావాలి. డబ్బు సంపాదించాలనుకునేవాడికి అమెరికాను మించిన ప్రదేశం ఏముంటుంది. అయితే సూరిలాంటి ఏ స్కిల్ లేని కుర్రాడు..అక్కడ ఏం చేసి డబ్బు సంపాదించగలడు. అందుకు ఏ మార్గం ఎంచుకున్నాడు. మంచి మార్గమైతే మాట్లాడుకునేదేం లేదు. అదే చెడు మార్గమైతే అన్ని ముళ్ల కంపలే. వాటిని దాటే క్రమంలో ఎన్నో దెబ్బలు, ఎదురు దెబ్బలు..వీటన్నిటిని సూరి ఎలా అధిగమించాడు. తన కుటుంబానికి ఎలా సాయపడ్డాడు, తన లవ్ స్టోరీకు ఎలా ముగింపుని ఎంచుకున్నాడు వంటి విషయాలు తెరపై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే…

చిన్న సినిమా చెయ్యాలంటే దాని స్పాన్ కు తగ్గ కథ ఉండాలి. అంతేకాని పెద్ద హీరో ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథని , ఆ హీరో దొరకలేదని కొద్దిగా పోపు పెట్టి చిన్న హీరోతో లాగిస్తే ఎలా ఉంటుంది..అటూ ఇటూ కాని అరవ పైత్యంలా ఉంటుంది. నువ్వు తోపురా మూవికు అదే జరిగిందనిపిస్తుంది. సుధాకర్ కోమాకుల అనే కుర్ర హీరోని దృష్టిలో పెట్టుకుని చేసిన కథలా అనిపించదు. పెద్ద పెద్ద డైలాగులు, ఛాలెంజ్ లు , ఫైట్స్, పాటలు..అబ్బో…. ఎనభైల్లో ఆగిపోయిన పాత తెలుగు సినిమా చూస్తున్నట్లు, తమిళ ప్లాఫ్ డబ్బింగ్ సినిమాని బలవతంగా ఏ బస్ లోనే వెళ్తున్నప్పుడు వేస్తే తప్పక చూడాలి అన్న  ఫీలింగ్ వస్తుంది. ఎక్కడా కథ భూమి మీద నడవదు. నేటివిటి అంటే కేవలం యాసలో డైలాగులు పలకటం కాదు కదా…అక్కడి దాకానే దర్శక,రచయితలు చూసుకున్నారు. 
ఈ ఓవర్ యాక్షన్ కు తోడు, కథలో చిత్రాతిచిత్రమైన మలుపులు. ఓ విషయం సస్టైన్ అవకుండానే దర్శకుడు మరో విషయంలో కు వెళ్లిపోతాడు. ఓ లక్ష్యం అంటూ లేకుండా సాగిన ఈ కథ..స్ట్రాంగ్ విలన్ లేకపోవటంతో యాక్షన్ నిరుపయోగం అయిపోతుంది. కథ కు సరైన స్క్రీన్ ప్లే లేకపోవటంతో ఎటు పడితే అటు వంగిపోతుంది. దాంతో బోర్ కొట్టేస్తుంది. 

ఈ సినిమాలో వంక పెట్టకుండా చేసింది సుధాకర్ . సూరి పాత్రకు ప్రాణం పోసాడు. తెలంగాణ స్లాంగ్ కూడా సుధాకర్ కి బాగా సెట్ అయ్యింది. వన్ మ్యాన్ ఆర్మీలా సినిమా ను అంతా తన భుజాలపై మోసాడు.
ఇక ఆర్టిస్ట్ లు మిగతా వాళ్లలో  హీరోయిన్ నిత్యాశెట్టి కి సీన్స్ పరిమితం.  ర‌వివ‌ర్మ‌, నిరోషా, మ‌హేష్ విట్టా, జ‌బ‌ర్ ద‌స్త్ రాకేష్‌, దువ్వాసి మోహన్ త‌దిత‌రులు వారు రెగ్యులర్ గా చేసుకుంటూపోయారు. చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెర పై కనిపించిన  నిరోష పెద్దగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోవటం అనవసరం.   సాంకేతికంగా..ఈ చిత్రం తో పరిచయం అయిన దర్శకుడు హరి బాబులో ఏదో చెప్పాలన్న తపన కనపడుతోంది కానీ అదేంటన్నది పూర్తిగా ఎలివేట్ కాలేదు. అందుకు సరైన స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే ఎంచుకోకపోవటమే.  అజ్జు మహంకాళి రాసిన డైలాగ్స్‌  బాగున్నా…మరీ ఇమేజ్ లేని హీరో  చెప్పటంతో అవి అతిగా చాలా చోట్ల అనిపించాయి. ప్రకాష్ వేలాయుధన్‌, వెంకట్‌ సీ దిలీప్‌ల సినిమాటోగ్రఫి  బాగుండి ఎడిటింగ్‌ సోసో.సురేష్ బొబ్బిలి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సినిమాని పడుకోపెట్టేసాయి.  ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా తగ్గట్టుగా ఉన్నాయి. 

 చూడచ్చా
మరీ బయిట ఎండ ఎక్కువగా ఉంది…అని థియోటర్ కు వెళ్దామనుకునేవాళ్ళకు ఈ సినిమా ఓ ఆప్షన్ గా మాత్రమే కనిపిస్తుంది. 

తెర వెనుక ..ముందు…
స‌మ‌ర్ప‌ణ‌: బేబీ జాహ్న‌వి

సంస్థ‌లు: యునైటడ్ ఫిలింస్, స్‌.జె.కె.ప్రొడక్ష‌న్స్ (యు.ఎస్‌.ఎ)

ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ బాబు.బి

నిర్మాత‌: డి.శ్రీకాంత్

విడుద‌ల‌: గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూట‌ర్స్


స‌హ నిర్మాత‌లు: డా. జేమ్స్ వాట్ కొమ్ముఅసోసియేట్

నిర్మాత‌: రితేష్ కుమార్‌ఆమెరికా

లైన్ ప్రొడ్యూస‌ర్‌: స్టెపెనీ ఒల్ల‌ర్ట‌న్‌,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌వివ‌ర్మ దంతులూరి.

స్టంట్స్‌: విజ‌య్ మాస్ట‌ర్‌, డుయ్ బెక్,

కెమెరా: ప్ర‌శాష్ వేలాయుధ‌న్‌, వెంక‌ట్ సి.దిలీప్‌,

ఆర్ట్‌: జెక్ జంజ‌ర్‌,

ఎడిట‌ర్: ఎస్.బి ఉద్ధ‌వ్‌,

సంగీతం: సురేష్ బొబ్బ‌లి,