నేలటిక్కెట్టు మూవీ ట్రయిలర్ రివ్యూ

Published On: May 17, 2018   |   Posted By:

నేలటిక్కెట్టు మూవీ ట్రయిలర్ రివ్యూ


తన నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో రవితేజకు బాగా తెలుసు. అందుకే తన సినిమాల్లో మాస్ మసాలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా చూసుకుంటాడు. మరీ ముఖ్యంగా తన మేనరిజమ్స్ అస్సలు మిస్ అవ్వడు. కథ ఏదైనా, దర్శకుడు ఎవరైనా రవితేజ మార్క్ ఉండాల్సిందే. నేలటిక్కెట్టు కూడా ఇందుకు అతీతం కాదు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది.

నేలటిక్కెట్టు ట్రయిలర్ లో మాస్ రాజా విశ్వరూపం కనిపించింది. అతడి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. జనం మధ్యలో మనం.. నేలటిక్కెట్ గాళ్లతో పెట్టుకోకు నేల నాకించేస్తారు లాంటి మాస్ డైలాగ్స్ ట్రయిలర్ లో బాగా పేలాయి. మధ్యమధ్యలో వచ్చిన సెంటిమెంట్ సీన్లు కూడా బాగా పండాయి. ఇక హాట్ హీరోయిన్ మాళవిక శర్మను ఈ సినిమాలో పద్ధతిగా చూపించారనే విషయం ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వం మెరుపులు, శక్తికాంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముకేష్ సినిమాటోగ్రఫీ, ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈనెల 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది నేలటిక్కెట్టు సినిమా.