నేల టిక్కెట్టు మొదటి రోజు వసూళ్లు

Published On: May 26, 2018   |   Posted By:
నేల టిక్కెట్టు మొదటి రోజు వసూళ్లు
విడుదలైన మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ తో ప్రారంభమైంది నేలటిక్కెట్టు సినిమా. రవితేజ, మాళవిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే వసూళ్లు చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పటివరకు రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ టచ్ చేసి చూడు మాత్రమే. ఈ ఇప్పుడా స్థానాన్ని నేలటిక్కెట్టు ఆక్రమించేలా కనిపిస్తోంది. నిన్న రిలీజైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 3 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం -రూ. 0.89 కోట్లు
సీడెడ్ -సీడెడ్ – రూ. 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 43,79,426
ఈస్ట్ – రూ. 38,24,222
వెస్ట్ – రూ. 21,50,451
గుంటూరు – రూ. 19,34,677
కృష్ణా  –  23,42,972
నెల్లూరు – 16,65,187