నైజాంలో సత్తా చాటుతున్న జై లవకుశ

Published On: October 5, 2017   |   Posted By:

నైజాంలో సత్తా చాటుతున్న జై లవకుశ

ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమా విడుదలైన అన్ని ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ రాబడుతోంది. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన మొదటిరోజు నుంచే నైజాంలో రికార్డులు సృష్టిస్తున్న జై లవకుశ సినిమా తాజాగా 15 కోట్ల రూపాయల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జై లవకుశ నిలిచింది.
ఇక వరల్డ్ వైడ్ వసూళ్ల వివరాలు చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 130 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ వీకెండ్ నాటికి మరిన్ని వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. 3 డిఫరెంట్ గెటప్స్ లో ఎన్టీఆర్ చేసిన ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.