న‌టుడి ఇంట్లో మ‌రో విషాదం

Published On: November 2, 2017   |   Posted By:
న‌టుడి ఇంట్లో మ‌రో విషాదం
సీనియ‌ర్ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్ ఇంట్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..న‌టి జీవిత అన్న‌య్య ముర‌ళీ శ్రీనివాస్ అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న పార్థీవ దేహానికి టోలీచౌకీలో అంత్య క్రియ‌లు నిర్వ‌హిస్తారు. కొన్ని రోజుల ముందే రాజ‌శేఖ‌ర్ త‌ల్లి గుండె నొప్పితో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌శేఖ‌ర్ ఆ బాధ నుండి తేరుకోక ముందే, ఆయ‌న ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకోవ‌డం బాధాక‌రం. రేపు రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన `పిఎస్‌వి గ‌రుడ‌వేగ‌` విడుద‌ల కానుంది.