న‌మిత పెళ్లి ముహూర్తం కుదిరింది

Published On: November 14, 2017   |   Posted By:
న‌మిత పెళ్లి ముహూర్తం కుదిరింది
హీరోయిన్ న‌మిత పెళ్లికి ముహూర్తం కుదిరింది. వివ‌రాల్లోకెళ్తే..తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించిన న‌మిత గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఈ అమ్మ‌డు త‌మిళ న‌టుడు వీర అలియాస్ వీర బాహును న‌వంబ‌ర్ 24న తిరుప‌తిలో పెళ్లి చేసుకోనుంది. ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌య‌మైన ఇద్ద‌రూ ప్రేమ‌లో పడ్డారు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోనున్నారు. సొంతం, ఒక రాజు ఒక రాణి, జెమిని, నాయ‌కుడు, సింహా వంటి ప‌లు చిత్రాల్లో న‌టించిన న‌మిత త‌మిళంలో బొద్దుగుమ్మ‌గా మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. తెలుగు కంటే త‌మిళంలో ఎక్కువ సినిమాలు చేసిన న‌మిత తాజాగా `పొట్టు` అనే హార‌ర్ సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు రానుంది.