న‌య‌న‌తార బాటలోనే వెళ్తారా

Published On: August 11, 2017   |   Posted By:
న‌య‌న‌తార బాటలోనే వెళ్తారా
బోయ‌పాటి శ్రీ‌ను.. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది  పేరు. తొలి చిత్రం భ‌ద్ర నుంచి విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ జ‌యజాన‌కి నాయ‌క వ‌ర‌కు యాక్ష‌న్ ఎపిసోడ్స్ లేకుండా సినిమాని తెర‌కెక్కించ‌లేదీ అగ్ర ద‌ర్శ‌కుడు. బోయ‌పాటి సినిమాల‌ను ప‌రిశీలిస్తే.. ఒకే క‌థానాయ‌కుడుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సంద‌ర్భం లేదు. అదే హీరోయిన్ల విషయాన్ని తీసుకుంటే.. తుల‌సి, సింహా చిత్రాల కోసం న‌య‌న‌తార‌కు వ‌రుస‌గా రెండు అవ‌కాశాలిచ్చాడు బోయ‌పాటి. ఈ రెండు చిత్రాలు కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించాయి.
న‌య‌న్ త‌రువాత మ‌ళ్లీ అలా ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కేథ‌రిన్‌ల‌కు వ‌రుస‌గా రెండు సినిమాల‌లో అవ‌కాశ‌మిచ్చాడు స‌ద‌రు ద‌ర్శ‌కుడు. స‌రైనోడు లో ర‌కుల్‌, కేథ‌రిన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తే.. త‌రువాతి చిత్ర‌మైన జ‌య‌జాన‌కి నాయ‌క కోసం ర‌కుల్ ని హీరోయిన్‌గానూ, కేథ‌రిన్‌ని ప్ర‌త్యేక గీతం కోసం ఎంచుకున్నాడు. మ‌రి న‌య‌న‌తార బాట‌లోనే ఈ ముద్దుగుమ్మ‌లు కూడా బోయ‌పాటికి రెండోసారీ క‌లిసొస్తారో లేదో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.