పంతం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 6 కోట్లు

Published On: February 20, 2018   |   Posted By:
పంతం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 6 కోట్లు
తెలుగులో వచ్చే యాక్షన్ సినిమాలకు హిందీ మంచి గిరాకీ ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్ లోని రూరల్ ప్రాంతాల్లో మన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు బాగా ఆడతాయి. దీనికి తోడు యూట్యూబ్ లో కూడా మన సినిమాలు హిందీలో కాసుల పంట పండిస్తాయి. అందుకే గోపీచంద్ నటిస్తున్న పంతం సినిమాకు కూడా మంచి రేట్ వచ్చింది. పంతం హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. గోపీచంద్ నటించిన ఓ సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో ఇంత మొత్తం రావడం ఇదే ఫస్ట్ టైం.
చక్రి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. కె.కె.రాధామోహన్ నిర్మాత. మే 18న పంతం సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తన రెండక్షరాల టైటిల్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు గోపీచంద్.