పటారుపాలెం ప్రేమకథ ట్రైలర్ లాంచ్

Published On: February 22, 2021   |   Posted By:
పటారుపాలెం ప్రేమకథ ట్రైలర్ లాంచ్
 
జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి  దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పటారుపాళెం ప్రేమ కథ” శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ అండ్ అతిధుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేసారు.   
 
ఈ సంధర్భంగా ఈ ట్రైలర్ లాంచ్ లో ప్రముఖ డైరెక్టర్ ఏం శంకర్ అండ్ వి సముద్ర లు పాల్గొని చిత్ర బృందానికి తమ బెస్ట్ విషెష్ తెలిపారు.  ప్రముఖ డైరెక్టర్ ఎన్ శంకర్ మాట్లాడుతూ “నాకు ఈ సినిమా డైరెక్టర్ ఎన్ శంకర్ ఎప్పటినుండో తెలుసు, తను నా దగ్గర జయం మనదేరా సినిమాకు అసోసియేట్ గా పనిచేసారు, అప్పుడే అనుకున్నా తిను ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతాడు అని, నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చి నేను ట్రైలర్ విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, సినిమా మంచి హిట్టు అవ్వాలి చిత్ర టీం కు మంచి సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.   
 
డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ “నాకు  దొరైరాజు చాలా మంచి స్నేహితుడు, నేను ఈ సినిమా చూసాను, చూసిన వెంటనే తమిళనాడు అండ్ కర్ణాటక ఏరియాలు బిజినెస్ చేయించా అంటే అర్ధం చేసుకోండి సినిమా ఎంత బాగా వచ్చిందో.. సినిమాలో ,మంచి కంటెంట్ ఉంది, ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాలి. సినిమా రేపు రిలీజ్ అయి మంచి హిట్టు అవ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా.  అన్నారు.   
 
ఈ సినిమా డైరెక్టర్ దొరై రాజు మాట్లాడుతూ, ముందుగా మా సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన ఎన్ శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.నేను గతంలో శ్రీ విష్ణు తో అండ్ శర్వానంద్ లతో కూడా సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు నా సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు.  నేను సినిమా ఇండస్ట్రీ కి ఏ పరిస్థుతులలో వచ్చానో నాకు తెలుసు, ఒకప్పుడు 2000 లేక ఉద్యోగం వదిలేసాను. ఇప్పుడు 2 కోట్లు పెట్టి నేనే స్వయంగా సినిమా నిర్మించాను. నేను నిర్మాతగా మారిన తరువాత నాకు నిర్మాత కష్టాలు తెలిసాయి. మా సినిమా ఇప్పుడు పురుడు పోసుకోనుంది.  నాకు సినిమా తప్ప మరేం తెలియదు. ఇది పరువుహత్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. నా సినిమాలో నా హీరో అండ్ నా హీరోయిన్ ఇద్దరూ చాలా బాగా నటించారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు రానుంది. చిన్న సినిమా అవ్వొచ్చు కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్ద సినిమా.  అందరూ మా సినిమాను తప్పకుండా చూసి ఆశీర్వదించండి అని తెలిపారు.  
 
ఈ చిత్ర హీరో శ్రీ మానస్ మాట్లాడుతూ నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా దొరైరాజు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నేను ఒక సాధారణ యువకుడిని. సినిమా అంటే చాలా ప్రేమ ఉండి సినిమా కోసం చాలా కష్టపడుతున్నా..  సినిమా చాలా బాగా వచ్చింది. చిన్న సినిమా బ్రతకాలంటే అది మీడియా సహకారం వల్లనే. కాబట్టి మా సినిమాకు మీడియా సహకారం కావాలి,  అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. మా సినిమాను సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు.  
 
ఈ సినిమా హీరోయిన్ సమ్మోహన మాట్లాడుతూ నేను ఓకే తెలుగమ్మాయినైప్పటికీ నాకు మా డైరెక్టర్ దొరై రాజు సార్ మంచి అవకాశం ఇచ్చారు. నా కో స్టార్ శ్రీ మానస్ నాకు చాలా హెల్ప్ చేసాడు. మా సినిమా చాలా బాగా వచ్చింది, అతి త్వరలో రిలీజ్ కానుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. మా సినిమాను చూసి మమ్మల్ని ఆధరించి మా సినిమాను పెద్ద హిట్టు చేయండి అని కోరారు.  
 
అయితే ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి. వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జె.ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని, పరువుహత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది, అతి త్వరలో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.