పరమానందయ్య శిష్యుల కథ  3డి టీజర్ విడుదల

Published On: October 21, 2019   |   Posted By:
పరమానందయ్య శిష్యుల కథ  3డి టీజర్ విడుదల
 
 
డైరెక్టర్ మారుతీ విడుదల చేసిన పరమానందయ్య శిష్యుల కథ  3డి టీజర్ 
 
అలనాటి పరమానందయ్య శిష్యుల కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే, ఈ నేపథ్యంలో పింక్ రోజ్ సినిమాస్ పతాకం పై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా వెంకట  రాజేష్ పులి దర్సకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సరిగా చిన్నారుల కోసం 3డి ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమాగా శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి విడుదల సిద్ధం అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని డైనమిక్ డైరెక్టర్ మారుతీ విడుదల చేశారు. ఈ సందర్బంగా మారుతూ మాట్లాడుతూ చిన్నారుల కోసం, పిల్లలకు నచ్చేలా ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథ ను  కొత్తగా చూపించే పప్రయత్నం చేసినందుకు ఈ చిత్ర బృందానికి నా అభినందనలు తెలుపుతున్నాను. పిల్లతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన మరిన్ని విషయాలు తెలుపుతామని నిర్మాతలు చెప్పారు.
 
చిన్నారుల కోసం తీసిన తొలి తెలుగు 3డి చిత్రం 
 
పరమానందయ్య శిష్యుల కథ లో ఉన్న నీతి ని చిన్నారులకు మరింతగా చేరవేయడం కోసం ఈ చిత్రాన్ని 3డి లో రెడీ చేశారు. ఇక అలానే ఈ సినిమా లో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే రీతిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. 
 
బ్యానర్ : పింక్ రోజ్ సినిమాస్ 
నిర్మాతలు : కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ
దర్సకత్వం : వెంకట రాజేష్ పులి
ఛాయాగ్రహణం : జి. ప్రభాకర్ రెడ్డి 
కూర్పు : కార్తీక్ శ్రీనివాస్ 
సంగీతం : యాజమాన్య