పరుచూరి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

Published On: August 8, 2020   |   Posted By:

పరుచూరి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి విజయలక్ష్మి గారు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పరుచూరి సోదరుల కుటుంబాలతో మా కుటుంబానికి మంచి స్నేహం ఉంది. ఈ కష్ట సమయంలో శ్రీ వెంకటేశ్వర రావు గారికి, వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.