పల్లెవాసి  మోషన్ పోస్టర్ విడుదల

Published On: September 14, 2018   |   Posted By:

పల్లెవాసి  మోషన్ పోస్టర్ విడుదల

 త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”.ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్.   మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పొస్టర్ ను వినాయక చవితి పర్వదినం సందర్బంగా విడుదల చేశారు

చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాధ్ మాట్లాడుతూ పల్లెటూరి నేపధ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా “పల్లెవాసి”. ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.
వినాయక చవితి సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామన్నారు.

నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ..తొంభై శాతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ‘పల్లెవాసి ‘ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

ఈ చిత్రానికి రచన, నిర్మాత: జి. రాం ప్రసాద్   కెమెరామెన్: లక్ష్మణ్, కో డైరెక్టర్: శ్యాం, ఎడిటర్ :జానకిరామ్ .
దర్శకత్వం: గోరంట్ల  సాయినాధ్.