పవన్ కల్యాణ్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

Published On: September 4, 2017   |   Posted By:

పవన్ కల్యాణ్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు టైటిల్ కూడా ప్రకటించకుండా చాలా సస్పెన్స్ మెయింటైన్ చేసిన యూనిట్..  అఫీషియల్ గా సినిమా ప్రచారం ప్రారంభించినట్టు అయింది.

పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఒక విధంగా దీన్నే ఫస్ట్ లుక్ అని కూడా అనుకోవచ్చు. సినిమా థీమ్ ను తెలిపేలా ఈ లుక్ విడుదల చేశారు. ఇందులో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఒక స్టిల్, సుదూర దూరాలు నడిచిపోతున్నట్టు ఉండే మరో స్టిల్ ను పెట్టారు.  ఈ రెండు స్టిల్స్ ను మిక్స్ చేస్తూ పవన్ 25వ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.