పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడోచ్

Published On: August 24, 2017   |   Posted By:

పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడోచ్

సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు కచ్చితంగా పవర్ స్టార్ 25వ సినిమాకు సంబంధించి ఏదో ఒక హంగామా ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. ఈసారి అంచనాల్ని వమ్ము చేయలేదు. సెప్టెంబ్ర 2న పవన్ కల్యాణ్ వస్తున్నాడు. అవును.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న 25వ సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2, పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలకాబోతోంది.

ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నామంటూ హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ అఫీషియల్ గా ప్రకటించింది. అంతేకాదు, ఓ స్టయిలిష్ స్టిల్ కూడా రిలీజ్ చేసింది. అందులో కేవలం కళ్లజోడు మాత్రమే కనిపిస్తోంది. కచ్చితంగా ఈ కళ్లజోడుకు, సెప్టెంబర్ 2న విడుదలకానున్న ఫస్ట్ లుక్ కు సంబంధం ఉండే ఉంటుంది. అంతలా సంబంధం లేకుండా త్రివిక్రమ్ ఏ పని చేయడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే పుట్టినరోజు సందర్భంగా కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేస్తారా.. టైటిల్ కూడా ప్రకటిస్తారా అనే విషయంపై మాత్రం యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.