పసివాడి ప్రాణం ఫస్ట్ లుక్ విడుదల

Published On: January 6, 2020   |   Posted By:

పసివాడి ప్రాణం ఫస్ట్ లుక్ విడుదల

‘పసివాడి ప్రాణం’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన డిప్యూటీ CM పిల్లి సుభాష్ చంద్ర బోస్

పూజ్యులు డిప్యుటీ CM శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు  ధన్ శ్రీ ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమా  “పసివాడి ప్రాణం” టైటిల్ రిలీజ్ చేయటంమాకెంతో ఆనందం  ఉత్సాహాన్ని కలిగించింది, మా విన్నపాన్ని మన్నించి “పసివాడి ప్రాణం’ టైటిల్ పోస్టర్ అవిష్కరించినదుకు శ్రీ బోసు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.  టాలీవుడ్లో ఇంతవరకూరానటువంటి వినుత్నమైన “లైవ్ కం యానిమేషన్” చిత్రం “పసివాడి ప్రాణం”.  మోషన్ కాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్టెక్నాలజీలతోనిర్మితమైన 3D మరియు2D కేరెక్టర్స్ మిగిలిన నటీనటులతో పోటిగా ప్రేక్షకులనుమెప్పించటం ఈ సినిమా ప్రత్యేకత. “పసివాడి ప్రాణం” 90స్ లో  మెగాస్టార్ చిరంజీవిగారు  నటించిన సూపర్ హిట్ సినిమా పేరు మా సినిమా పేరు ఒకటే కావటం యాద్రుచ్చికం.  కానీ ఆ సినిమాలో పసివాడిగా నటించి మెప్పించిన,ఈనాటి బుల్లితెర వదినమ్మ ఫేం‘సుజిత’గారు ఈ సినిమాలో అతిముఖ్యమైన తల్లిపాత్రలో అద్భుతంగా  నటించారు.అల్లువారి వంశంనుండి వచ్చిన యువకుడు  “అల్లు వంశీ”ని హీరోగా పరిచయం చేస్తున్నాం.  అల్లు వంశీ సరసన జంటగా దక్షిణాది తార ‘ఇతి ఆచార్య’ను తెలుగుతెరకి పరిచయం చేస్తున్నాం.ఈ సినిమాలో మరికొన్ని ముఖ పాత్రలలో సాయి, యోగి,రుబినా, FM బాబాయ్ నటించారు.ఈ సినిమాకి కథ ప్రాణమైతే ఉపిరి CG వర్క్.   మోషన్ కాప్చర్, 3D మరియు2D ఏనిమేషన్, గ్రాఫిక్స్  విశాఖపట్నం” Imagicans” సంస్థ చేసింది.  మొకేప్ స్పెషలిస్టులు విజయ్, సుమన్, Imagicans శేషగిరిగారికి ప్రత్యక ధన్యవాదములు అని అన్నారు . దర్సక నిర్మాత మూర్తి .

  సాంకేతికవర్గం:  కెమెరా K.బుజ్జి; సంగీతం:G.J.కార్తికేయన్;    కొరియోగ్రఫీ- చార్లీ; ఫైట్స్- కుంగ్ ఫూ శేఖర్; స్టొరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్  N.S.మూర్తి.